కేరళలో లోక్ సభ స్థానాలను తగ్గించమని రేవంత్ రెడ్డి కోరాలి: రాంచందర్ రావు

  • కేరళలో 20 లోక్ సభ స్థానాలు ఉంటే తెలంగాణలో 17 ఉన్నాయన్న రాంచందర్ రావు
  • ముందు కేరళలో సీట్లు తగ్గించాలని అడగాలని సవాల్
  • కాంగ్రెస్ జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఇచ్చిందని ఆరోపణ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సవాల్ విసిరారు. కేరళలో 20 లోక్ సభ స్థానాలు ఉంటే, తెలంగాణలో 17 మాత్రమే ఉన్నాయని గుర్తు చేశారు. మొదట కేరళలో లోక్ సభ సీట్లను తగ్గించాలని రేవంత్ రెడ్డి అడగాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాలకు తక్కువ సీట్లు ఇచ్చారని ఆరోపించారు.

మహిళా రిజర్వేషన్‌లు అమలు చేయాలని, డీలిమిటేషన్ చేపట్టాలని లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కొత్త పార్లమెంటు భవనంలోనే కోరారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు వారే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.

543 సీట్లలోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ ఇప్పుడు కోరడం విడ్డూరంగా ఉందని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పాటించడం వల్ల జనాభా తగ్గిందని, ఉత్తరాదిన పాటించలేదని రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వింత వాదన చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Revanth Reddy
Ramachander Rao
Telangana
Kerala
Lok Sabha seats
delimitation
Rahul Gandhi

More Telugu News